20.7 C
Hyderabad
Monday, February 16, 2026
HomeWorldBangladesh: తారిఖ్ రెహ్మాన్ ప్రమాణ స్వీకారానికి మోదీకి ఆహ్వానం

Bangladesh: తారిఖ్ రెహ్మాన్ ప్రమాణ స్వీకారానికి మోదీకి ఆహ్వానం

న్యూఢిల్లీ/ఢాకా: బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా ఎన్నికైన తారిఖ్ రెహ్మాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించినట్లు సమాచారం. ఫిబ్రవరి 17న (మంగళవారం) ఈ కార్యక్రమం జరగనుంది.

అయితే, అదే రోజు ముంబైలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో ద్వైపాక్షిక చర్చలు ఉండటంతో.. ప్రధాని మోదీ స్వయంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం తక్కువగా ఉంది.

ప్రధాని మోదీ తరఫున కేంద్ర మంత్రి ఒకరు లేదా ఉన్నతాధికారి ఈ వేడుకకు వెళ్లే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాలు భావిస్తున్నాయి.

ఓ లుక్కేయండి

తాజా వార్తలు

Join WhatsApp Channel