భారత్, అమెరికా మధ్య కుదిరిన భారీ వాణిజ్య ఒప్పందం (Trade Deal) నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అప్రమత్తమయ్యారు. ఈ ఒప్పందం జరిగిన వెంటనే పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో అత్యవసరంగా ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం.
అమెరికాతో భారత్ చేతులు కలపడాన్ని రష్యా తీవ్రంగా పరిగణిస్తోంది. దీనికి ప్రతిచర్యగా చైనాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా పుతిన్ అడుగులు వేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. జిన్‌పింగ్‌తో జరిగిన ఫోన్ సంభాషణలో ఇరు దేశాల మధ్య ఆర్థిక, రక్షణ రంగాల్లో సహకారంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది.
ఇన్నాళ్లు భారత్‌తో రష్యాకు ఉన్న సన్నిహిత సంబంధాలపై తాజా వాణిజ్య ఒప్పందం ప్రభావం చూపే అవకాశం ఉందని, అందుకే పుతిన్ ప్రత్యామ్నాయంగా డ్రాగన్ దేశం వైపు మొగ్గు చూపుతున్నారని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. భారత్-అమెరికా బంధం బలపడటం ఆసియాలో సరికొత్త కూటములకు దారితీస్తోందని, దీనిని ఎదుర్కొనేందుకు రష్యా-చైనా కూటమి మరింత గట్టిపడే అవకాశం ఉందని, దీనివల్ల రక్షణరంగంలో కూడా భారత్ నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

