న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ‘బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ’ (BNP) ఘనవిజయం సాధించిన నేపథ్యంలో.. ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షుడు తారిఖ్ రెహ్మాన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యం పునరుద్ధరణ దిశగా సాగుతున్న ఈ ప్రయాణంలో భారత్ ఎల్లప్పుడూ తోడుంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తారిఖ్ రెహ్మాన్‌తో ఫోన్లో మాట్లాడిన ఆయన, కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు.
బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో బీఎన్‌పీ నిర్ణయాత్మక విజయం సాధించడం ఆ దేశ రాజకీయాల్లో కీలక మలుపుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నుంచి వచ్చిన అభినందనలు దౌత్యపరంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ప్రధాని మోదీ అభినందనలకు తారిఖ్ రెహ్మాన్ కృతజ్ఞతలు తెలుపుతూ.. భారత్‌తో తమ దేశానికి ఉన్న సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

