అమెరికా అధ్యక్ష రేసులో కమలా హ్యారిస్ ??? బైడెన్ పై పార్టీలో వ్యతిరేకత

Photo of author

Eevela_Team

Share this Article

అధ్యక్ష ఎన్నికలకు ముందు డెమోక్రాట్లకు పెద్ద సమస్య వచ్చిపడింది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన మొదటి డిబేట్‌లో అధ్యక్షుడు జో బైడెన్ కాస్త తడబడ్డారని.. అందుకే ఈ డిబేట్‌లో ట్రంప్ కంటే బైడెన్ వెనుకబడ్డారని వస్తున్న వార్తలు.. డెమోక్రటిక్ పార్టీని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష రేసు నుంచి పక్కకు జరగాలంటూ జో బైడెన్‌పై పార్టీలోనే  తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. సొంత పార్టీ నేతలే బైడెన్ తీరును తీవ్రంగా విమర్శిస్తున్నారు. 

ఈ క్రమంలోనే బైడెన్‌కు అత్యంత సన్నిహితుడు, హవాయి గవర్నర్ జోష్ గ్రీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష పోటీకి సంబంధించి బైడెన్‌ త్వరలో తన నిర్ణయాన్ని వెల్లడిస్తారని ఆయన తెలిపారు ఇటీవల బైడెన్‌తోపాటు ఇతర డెమోక్రాటిక్ పార్టీకి చెందిన గవర్నర్లతో సమావేశం అయిన జోష్ గ్రీన్.. ఆ తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం అమెరికాలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

.

ఇదే జరిగితే భారత సంతతి వ్యక్తి అమెరికా అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేయడం మొదటిసారి కావచ్చు.. భారతీయ మూలాలతో పాటు నల్లజాతీయురాలైన కమల హారిస్‌ను డెమోక్రాట్ అభ్యర్థిగా ప్రకటిస్తే.. ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌లో బాగా కలిసొస్తుందని కొందరు రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Join WhatsApp Channel
Join WhatsApp Channel