Home » Education » TS Inter Results 2024 Released, 64.19% పాస్, తెలంగాణా ఇంటర్ ఫలితాలు

TS Inter Results 2024 Released, 64.19% పాస్, తెలంగాణా ఇంటర్ ఫలితాలు

by Eevela_team

తెలంగాణాలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు 24 ఏప్రిల్ బుధవారం ఉదయం 11 గంటలకు విడుదల అయ్యాయి. ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం ఫలితాలు ఒకేసారి విడుదల చేయనున్నారు. హైదరాబాద్ లోని ఇంటర్ బోర్డ్ కార్యాలయంలో ఈ ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాల అప్డేట్స్ క్రింద చూడవచ్చు ..

This event has ended.

21:42:43
TS Inter Results 2024: ఫలితాల కోసం ఎదురుచూస్తున్న 10 లక్షల మంది

ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ఇంటర్‌ పరీక్షలు జరిగాయి. తెలంగాణ ఇంటర్ పరీక్షలకు దాదాపు 9.80 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. 4,78,527 మంది ఫస్టియర్ విద్యార్థులు, 4,43,993 మంది సెకండియర్ విద్యార్థులు పరీక్షలు రాశారు.

21:46:16
Telangana Inter Results 2024: విడుదలకు సర్వం సిద్దం

దాదాపు 60 లక్షల సమాధాన పత్రాల మూల్యాంకనను మార్చి నెలాఖరుతో పూర్తి చేశారు. ఏప్రిల్ మొదటి వారంలో ఓఎంఆర్‌ షీట్ల డీ కోడింగ్‌ చేశారు. మార్కులు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన తర్వాత అన్ని విధాలా పరిశీలన చేశారు. ఎలాంటి సమస్యలు లేకపోవడంతో అధికారికంగా విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారు.

April 23, 2024
TS Inter Results 2024 ఎన్ని గంటలకు అంటే..

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలను ఏప్రిల్‌ 24న (బుధవారం) ఉదయం 11 గంటలకు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ ఫలితాలు ఒకేసారి విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డ్ ప్రకటించింది . ఈ ఫలితాలను ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శృతి ఓజా విడుదల చేస్తారని బోర్డ్ ఒక ప్రకటనలో తెలిపింది.

21:56:02
TS Inter Results 2024 Very Fast ఇంటర్ ఫలితాలు సింగిల్ క్లిక్ తో ఇలా..

ఏప్రిల్ 24వ తేదీన ఉదయం 11 గంటలకు విడుదల అవ్వబోతున్న ఫలితాలను అనేక వెబ్సైట్ లు అందిస్తాయి. ఈనాడు, సాక్షి, manabadi, schools9 మరియు అధికారిక వెబ్సైట్ లు అందిస్తాయని తెలిసిందే..

అయితే వాటి లింకులను వెతికి పట్టుకోవడం, అందులో ఏది పనిచేస్తుందో తెలుసుకోవడం కష్టమే.. దీనికోసం ఒకే ఒక్క క్లిక్ తో అన్ని ఫలితాలు చూపించి, ఏ లింకు పనిచేస్తుందో చెపుతూ www.schools360.in ఒక వినూత్న ప్రయోగం చేసింది. క్రింది లింకు ద్వారా అక్కడికి చేసరుకోవచ్చు.

ఫలితాలు 11 గంటలకు అందరికన్నా ముందు తెలుసుకోవాలంటే . ఇక్కడ క్లిక్ చేయండి..

 

11:02:57
ఫలితాల విడుదల హైలైట్స్

* 1521 సెంటర్స్ లో పరీక్షలు జరిగాయి

First Year Pass Percentage - 60.01%

2nd Year Pass Percentage 64.19%

You may also like