Home » Politics » Pithapuram: నామినేషన్‌ వేసిన పవన్‌కళ్యాణ్… వామ్మో ఇన్ని అప్పులా!

Pithapuram: నామినేషన్‌ వేసిన పవన్‌కళ్యాణ్… వామ్మో ఇన్ని అప్పులా!

by Eevela_team

పిఠాపురం అసెంబ్లీ స్థానానికి ఎన్డీఏ కూటమి అభ్యర్ధిగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీగా తరలి వచ్చిన పార్టీ శ్రేణులతో కలిసి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలోని చేబ్రోలులోని నివాసం నుంచి పిఠాపురంలోని పాదగయ క్షేత్రం వరకు వెళ్లారు. ఆ తర్వాత ఆర్వో కార్యాలయానికి చేరుకుని ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం టీడీపీ ఇంచార్జి వ‌ర్మతో పాటు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పాల్గొన్నారు.

ఆశీర్వదించండి: పవన్

తన నామినేషన్ అనంతరం పవన్ మాట్లాడుతూ ఈ ఎన్నికలు రాష్ట్రానికి కీలకం అని, ఐదేళ్ల జగన్ ప్రభుత్వానికి చరమ గీతం పాడేలా నామినేషన్ వేశానని, ప్రజలు తనను ఈ ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరారు. వేరే పార్టీలకు కేటాయించిన స్థానాల్లో నామినేషన్ వేసిన జనసేన నాయకులు చాలామంది తనమీద ప్రేమతో ఉపసంహరించుకున్నారని తెలిపారు.

పవన్ కళ్యాణ్ ఎన్నికల అఫిడవిట్ లో ఏముందంటే ..

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో గత అయిదు ఆర్థిక సంవత్సరాల ఆదాయం, అప్పులు, చెల్లించిన పన్నుల వివరాలు తెలిపారు. గత 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ సంపాదన దాదాపు రూ.115 కోట్లు కాగా, దీనిపై  ఆదాయ పన్నుగా రూ.48 కోట్లు, జీఎస్టీ రూపంలో మరో రూ.29 కోట్లు చెల్లించారు. ఇక ఎన్నికల అఫిడవిట్ లో పవన్ కళ్యాణ్ తన అప్పుల గురించి ప్రస్తావిస్తూ తన అప్పులు రూ.65 కోట్లు గా చూపించారు. ఇందులో వివిధ బ్యాంకుల నుంచి రూ.18 కోట్లు అప్పుగా తీసుకోగా, వ్యక్తుల నుంచి దాదాపు  రూ.47 లక్షలు తీసుకున్నారని తెలిపారు. ఇకపోతే ఆయన దాదాపు రూ.20 కోట్లకు పైగానే వివిధ సంస్థలకు, జనసేన పార్టీ చేపట్టే సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల నిమిత్తం విరాళాలు కూడా అందించినట్లు తన ఎన్నికల అఫిడవిట్ లో తెలియచేసారు.

 

You may also like