పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ లోని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా తుడిచిపెట్టడానికి భారత్ చేపట్టిన చర్య పేరు ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor).
బుధవారం తెల్లవారు జామున1.44 గంటలకు ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసి దాదాపు 80 మంది తీవ్రవాదులను తుదముట్టించింది. ఖచ్చితమైన సమాచారంతో భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఈ సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. ఈ దాడిలో పలు ఆయుధాలు, డ్రోన్లు ఉపయోగిందారు.
