26.2 C
Hyderabad
Wednesday, February 4, 2026
HometrendingNaga Chaitanya: నాగ చైతన్య ట్విట్టర్ అకౌంట్ హ్యాక్...సంచలన ట్వీట్ తో..

Naga Chaitanya: నాగ చైతన్య ట్విట్టర్ అకౌంట్ హ్యాక్…సంచలన ట్వీట్ తో..

గత కొద్దిరోజులుగా కొండా సురేఖ వివాదంతో వార్తల్లో నిలుస్తూ వస్తున్న అక్కినేని నాగచైతన్య ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. తాజాగా ఆయన ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక ట్వీట్ వచ్చింది. తాను 50 డాలర్లకు వంద బిట్ కాయిన్లను 2013లో కొనుగోలు చేశానని వాటి విలువ ఇప్పుడు ఆరు మిలియన్ డాలర్లు అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు గివ్ ఇవే ఇవ్వాలా వద్దా ఓటు చేయండి అంటూ ఆయన అకౌంట్ నుంచి ఓటింగ్ ట్వీట్ వచ్చింది. చాలామంది పోల్ లో పాల్గొనడంతోపాటు తమకు కావాలంటూ పోస్టులు పెట్టారు. అయితే సాధారణంగా ఇలాంటి బిట్ కాయిన్ వ్యవహారాల గురించి ఎక్కువగా హ్యాక్ చేసిన తర్వాత హ్యాకర్లు మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటారు.వెంటనే ఈ విషయం తెలియడంతో నాగచైతన్య టీం స్పందించి ఆ పోస్టును తొలగించింది.

నాగచైతన్య ట్విట్టర్ అకౌంట్ 2017లో తీసుకున్నారు. ఆయనకు ట్విట్టర్ లో 2.6 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతం చైతూ చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తోంది.

ఓ లుక్కేయండి

తాజా వార్తలు

Join WhatsApp Channel