పహేల్ గావ్ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భారత ప్రధాని మోడీ హెచ్చరికతో రెండుదేశాల్లోని ప్రజలు ఇక యుద్దం అనివార్యం అనే భావిస్తున్నారు. ఆ తదనంతర పరిణామాలు.. భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇక యుద్దం ఏ క్షణంలో అయినా మొదలు కావచ్చు అనే సూచిస్తున్నాయి..
ఇక మీడియా.. సోషల్ మీడియా .. యూట్యూబ్ లలో వస్తున్న కథనాలు ఇప్పటికే దాడులు మొదలయ్యాయి అని ఊదరగొట్టేస్తున్నాయి..
అయితే భారత్ ప్రజలు యుద్దం చేసి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాదీనం చేసుకోవాలి అని తీవ్రంగా వాదిస్తుంటే.. పాక్ జనాలు మాత్రం యుద్దం వద్దు అని ఆదేశ ప్రభుత్వంపై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు..
అయితే యుద్దం జరిగితే ఎన్ని రోజుల్లో ముగుస్తుంది అనేది ప్రస్తుతం విశ్లేషకుల.. అధినేతల మద్య జరుగుతున్న చర్చ..
కొందరు 7 రోజుల్లో పాకిస్తాన్ ఓడిపోతుంది అంటుంటే .. మరికొందరు 6 గంటలు చాలు అంటూ వాదిస్తున్నారు.. నిజానికి నిజంగా యుద్దం కొద్ది రోజుల్లో ముగుస్తుందా అంటే అనుమానమే!
అమెరికా, ఇజ్రాయెల్, రష్యా లాంటి దేశాలు యుద్దాన్ని ప్రోత్సాహిస్తున్నారు.. మీరు ముందుకు పొండి మీకు మెమున్నాం అంటున్నాయి.. అయినా సరే మన దేశం ఎందుకు వెనకాడుతోంది? ఒకసారి యుద్దం మొదలయ్యాక ఆపడానికి కుదరదు.. ఎవరో ఒకరు చేతులు ఎత్తేయాలి.. అయితే ఇరు దేశాలకు ఇప్పుడు ఉన్న మద్దతు ఇలాగే ఉంటుందా అంటే చెప్పలేం.. పాకిస్తాన్ కు చైనా, టర్కీ లతో పాటూ మరికొన్ని ఇస్లామిక్ దేశాలు మద్దతు పలికితే భారత్ విజయం నల్లేరు మీద నడక ఎంతమాత్రం కాదు.
జీడీపీ లో దూసుకుపోతున్న భారత్ ను కంట్రోల్ చేయడానికి యుద్దం అనే ఊబిలోకి మనల్ని అమెరికా లాంటి కొన్ని దేశాలు నెట్టేస్తున్నాయా అనేది కూడా అనుమానించాల్సిందే!
పాకిస్తాన్ తో యుద్దం కనుక మొదలైతే మన దేశం కూడా తీవ్ర ఆర్ధిక సంక్షోభంలోకి కూరుకుపోతుందని అనిపిస్తోంది. అభివృద్ది పలాలు అందుకోబోతున్న తరుణంలో మరోసారి ఆర్ధిక వ్యవస్థ కుడుపులకు గురికావచ్చు.
అతి శక్తివంతమైన రష్యా .. చిన్న దేశం అయిన ఉక్రెయిన్ పై యుద్దం మొదలెట్టి ఎంతో కాలం అయింది. ఇంకా ఆగే సూచనలు అస్సలు కనిపించడం లేదు.. ఆయుధాల పరంగా అత్యంత భయంకరమైన ఇజ్రాయెల్ .. ఇప్పటిదాకా యుద్దాన్ని ముగించలేక పోయింది.. అంతెందుకు ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సైన్యం ఏళ్ల తరబడి యుద్దం చేసి కూడా చేసేది లేక ఉన్నవన్నీ వొదిలేసి మరీ పారిపోయింది.
అలాంటిది మనదేశం పాకిస్తాన్ ను కొద్ది గంటల్లో .. కొద్ది రోజుల్లో ఎలా నిలువరించగలదు?
సరే ఒకవేళ పాకిస్తాన్ ని ఓడించి కాశ్మీర్ ను లాగేసుకుంటుంది అనుకుందాం.. అప్పుడు ఉగ్రవాద సమస్య తీరుతుందా? ఉగ్రవాదులకు కాశ్మీర్తో కాదు సమస్య.. వారి కోపం మన దేశం పైన.. మన మెజారిటీ మతం పైన! ఉగ్రవాదానికి పాక్ పైన దాడి చేసినంత మాత్రాన శాశ్వత పరిష్కారం రాదు.
మరి మన దేశం ఏం చేయాలి?
నిజానికి మనదేశం ఏమీ చేయనవసరం లేదు.. ఇప్పటికే పాకిస్తాన్ లో అంతరయుద్దం జరుగుతుంది.. పాక్ ప్రజలు విడిపోయి ఉన్నారు.. వారిలో సఖ్యత లేదు.. పార్టీల మద్య.. వర్గాల మద్య.. ప్రాంతాల మద్య విభేదాలు తారా స్థాయిలో ఉన్నాయి.. మన యుద్దంతో విడిపోయిన వారు దేశం కోసం మళ్ళీ కలిసినా ఆశ్చర్యం లేదు.. అందుకే భారత్ ఏమీ చేయనవసరం లేదు..
మనం పోరాడాల్సింది దేశంలోకి ప్రవేశిస్తున్న.. దేశంలో తల దాచుకుంటున్న.. దేశంలోపలి ఉగ్రవాదులతో అంతే!