ఏదో జరిగింది .. కానీ ఆధారాల్లేవ్: జగన్ సంచలన వ్యాఖ్య

1
2
ఏదో జరిగింది .. కానీ ఆధారాల్లేవ్: జగన్ సంచలన వ్యాఖ్య
ప్రజలకు ఎంతో చేశాం వోట్లన్నీ ఏమై పోయాయో తెలీడం లేదు .. అని జగన్ తన ప్రెస్ మీట్ లో ఆవేదనగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో ఘోర ఫలితాలను చవిచూసిన తర్వాత వైకాపా అధినేత వైఎస్‌ జగన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. 
ఏదో జరిగింది .. కానీ ఆధారాల్లేవ్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. 
ఆయన ప్రసంగం సాగిందిలా .. 
‘‘ఎన్నో పథకాలతో ప్రజలకు అండగా ఉన్నాం. పథకాలు అందుకున్న వారి ఆప్యాయత
ఏమైందో తెలియదు. ప్రజలకు మంచి చేసినా ఓటమి పాలయ్యాం. 54 లక్షల మంది రైతులకు
పెట్టుబడి సాయం చేశాం. రైతన్నలను అన్ని రకాలుగా ఆదుకున్నాం. అరకోటి రైతన్న
ప్రేమ ఏమైందో అర్థం కావడం లేదు. డ్వాక్రా మహిళలు, ఆటో డ్రైవర్లు, గీత
కార్మికులు, మత్స్యకారులకు అండగా ఉన్నాం. ఇన్ని కోట్ల మందికి ఎంతో మేలు
చేసినా ఓడిపోయాం. 
మ్యానిఫెస్టో హామీలను 99 శాతం అమలుచేశాం. పేద పిల్లల
చదువుల కోసం ఎంతో సాయం చేశాం. గ్రామాల్లో ఎన్నడూ చూడని సచివాలయ వ్యవస్థ
ఏర్పాటుచేశాం. 
అయినా, ప్రజల తీర్పును తాము తీసుకుంటాం. మంచి చేయడానికి
ఎప్పుడూ ముందుంటాం. పేదవాడికి అండగా ఉంటూ గళం విప్పుతాం. 
నా రాజకీయ జీవితం అంతా ప్రతిపక్షం లోనే ఎక్కువ గడిపాను.. కష్టాలు ఏమీ క్రొత్త కాదు. ఇంకా కష్టాలు పెట్టినా ఎదుర్కొంటాం.’’ అని జగన్‌ వ్యాఖ్యానించారు.
చివరిగా అధికారంలోకి వచ్చిన కూటమి నేతలను అభినందించి సమావేశం ముగించారు.

1 COMMENT

  1. ప్రజలకు ఎంతో చేశాం అని మనం అనటం కాదయ్యా, ప్రజలకు ఎంతో చేశాడు అని ప్రజలు అనాలి. అలా అనలేదు అంటే అది ప్రజల తప్పు అనే ముందు మనం చేసిన తప్పులను నెమరువేసుకోవాలి నాయనా!

    ఒక గట్టి ఎదురుదెబ్బ తిన్నప్పుడు మనసు deinal phase లో ఉండిపోతుంది కొంత కాలం. అది అర్ధం చేసుకోగలం. సమయం తీసుకొని, కోలుకొని ముందుముందు నిజాయితీగా ప్రజలకు సేవచేయటం గురించి ఆలోచన చేయటం బాగుంటుంది.

Comments are closed.