ప్రధాని మోడీతో సమావేశం అయి తిరిగివచ్చారు చంద్రబాబు. అయినా ఇప్పటిదాకా ఆయన కానీ బిజెపి నాయకులు కానీ నోరు మెదపలేదు. ఈ విషయం అటుంచితే ఇప్పటివరకు బీజేపీపై వ్యతిరేక వార్తలు వ్రాస్తున్న ఒక వర్గం మీడియా సైలెంట్ అయింది. మోడీ-బాబు చర్చల గురించిన ఊహాగానాలను కూడా వారు ప్రస్తావించడం లేదు. దీనిని బట్టి ఆ రెండు పార్టీల మధ్య సయోధ్య ఇంకా కుదరలేదని అర్ధం చేసుకోవచ్చు.
రేపు పొత్తు కుదిరినట్లైతే ఒక్కసారిగా మోడీ అనుకూల వైఖరి, విఫలం అయితే వ్యతిరేక వైఖరి అనుసరించడానికి ప్రస్తుతం ఆ మీడియా స్తబ్దుగా ఉన్నట్లు అర్ధం అవుతోంది.
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం నిజేపీ పవర్ షేరింగ్ తో పాటూ గణనీయంగానే సీట్లు అడిగి ఉంటుందని భావన. 20 వరకు అసెంబ్లీ, 8 వరకు లోక్ సభ సీట్లు అడిగారని, ఆయా నియోజకవర్గాలను కూడా చెప్పి ఆ ప్రాంతాలలో బిజెపి అవసరం ఉంది అని కావాలంటే సర్వే చేసుకోండి చెప్పినట్లు తెలుస్తోంది అంటున్నారు. కనీసం బేరమాడే అవకాశం కూడా బాబుకి ఇవ్వలేదని అందుకే మౌనంగా తిరిగివచ్చినట్లు చెపుతున్నారు.
ఇప్పటికే జనసేనతో సీట్ల సర్దుబాటు పూర్తికాని ప్రస్తుత పరిస్తితి చంద్రబాబు పెనం మీంచి పొయ్యిలోకి పడినట్లుగా అయిందని ఆ పార్టీని సపోర్ట్ చేసే వక్త ఒకరు చెప్పారు. ఈ అభిప్రాయాలు ఒక దారికి రాబాలంటే రెండు మూడు రోజులు వేచి చూడాల్సిందే!