‘ఏం పిల్లో ఏం పిల్లడో’ చిత్రంతో టాలీవుడ్‌కి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రణీత సుభాష్ తాను మరోసారి తల్లి కాబోతున్నానని ప్రకటించింది. అంతేకాదు తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ లో బేబీ బంప్ ఫొటోలను షేర్ చేస్తూ “రౌండ్ 2.. ఇక ఈ ప్యాంట్స్ నాకు ఫిట్ అవ్వవు” అంటూ క్యాప్షన్ ఇచ్చింది ప్రణీత.
తెలుగులో బావ, అత్తారింటికి దారేది, పాండవలు పాండవులు తుమ్మెద, రభస, బ్రహ్మోత్సవం వంటి చిత్రాలలో నటించి ఫ్యాన్ ఫాలోయింగ్ సమకూర్చుకుంది. అంతేకాదు కన్నడ, తమిళ్, మలయాళం, హిందీలలో కూడా పలు చిత్రాల్లో మంచి పాత్రలే చేసింది.
అయితే ఆతర్వాత 2021లో బిజినెస్‌మ్యాన్ నితిన్ రాజును వివాహం చేసుకుని నటనకు దూరం అయింది. 2022 జూన్‌లో ఓ పాపకి ప్రణీత జన్మనిచ్చింది. దీంతో కెరీర్‌కి బ్రేక్ పడింది.
ఇటీవలే మరోసారి కెరీర్ స్టార్ట్ చేసిన ప్రణీత.. మలయాళం, కన్నడలో రెండు సినిమాలు కూడా చేసింది. తెలుగులో ఆదరణ పొందిన “ఢీ” డ్యాన్స్ షోలో కూడా ఇటీవల కొన్ని ఎపిసోడ్లకి జడ్జీగా కూడా వ్యవహరించింది. ఇంతలోనే ఫ్యాన్స్ ని అప్సెట్ చేస్తూ ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో కొందరు ఫ్యాన్స్ ప్రణీతకి కంగ్రాట్స్ చెబుతూ కామెంట్లు పెడుతుండగా, మరి కొందరు మాత్రం ఇంత త్వరగా ఎందుకు అంటూ ప్రశ్నలు వేస్తున్నారు.