ఎన్నికల ముందు ఏ విశ్లేషకుడు చెప్పినా, ఏ సర్వే చూసినా వైసీపీ మళ్ళీ గెలుస్తుంది అనే సాగింది. ఒకవైపు టీవి9, NTV లలో చర్చలు, సోషల్ మీడియా, యూట్యూబ్ లలో అయితే ఒక యుద్దం లాగా జగన్ అనుకూల ప్రచారం సాగింది. ప్రజల్లో సానుకూలత ఉంది అని, వారు కూటమిని ఒడిస్తారు అని ఎక్కువ మంది విశ్లేషకుల అవతారం ఎత్తి మరీ చెప్పారు.
అయితే .. ఎన్నికలు పూర్తయ్యాయి.. ఇప్పుడు ఒక్కొక్కరుగా స్వరం మారుస్తున్న సూచనలు కనపడుతున్నాయి.
ముందుగా పోలీస్ శాఖ కోసం చెప్పాలి.. ఎన్నికల ఓటింగ్ లో బలమైన ప్రభావితం చేసే శాఖ పోలీస్ శాఖ. ఎన్నికల సరళి వారికి తెలిసినంత ఎవరికీ తెలీదని చెపుతారు. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే కూటమి గెలుస్తుంది అని వారు నిర్ణయించుకున్నట్లే అనిపిస్తోంది. ఎన్నికల అనంతర అల్లర్లలో వాళ్ళు టిడిపికె మద్దతు ఇస్తూ వైసీపీ ఇస్తున్న కంప్లైంట్ లను కూడా బేఖాతరు చేస్తుండడం గమనార్హం.
ఇక, ప్రొఫెసర్ నాగేశ్వర్.. ఎన్నికల ముందు జగన్ గెలుస్తాడు అని పూర్తి అనుకూలంగా వ్యాఖ్యలు చేసి టిడిపి సోషల్ మీడియా ఆగ్రహానికి గురైన ఈయన, ఈరోజు NTVలో జగిరిన చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ జగన్ కు వ్యతిరేకతే ఎక్కువగా ఉన్నదని చెప్పారు.
మరోవైపు జర్నలిస్ట్ సాయి కూడా జగన్ అనుకూల స్వరం మార్చి చంద్రబాబు వైపు మొగ్గుచూపుతున్నారు.
ఇంకొన్ని యూట్యూబ్ చానల్స్ కూడా జగన్ అనుకూల వార్తలు ఆపివేసి, కూటమి వైపు మొగ్గు చూపుతున్నట్లు మాట్లాడుతున్నారు.
ఇవన్నీ చూస్తుంటే జూన్ 4 వ తేదీ రాష్ట్ర చరిత్రను తిరగరాస్తుందేమో అనిపిస్తోంది..