- రేపు సాయంత్రం చంద్రబాబు నాయుడు డిల్లీకి వెళ్లనున్నారా?
- పొత్తుపై బిజెపి సానుకూలంగా ఉందా?
- బిజెపి హైకమాండ్ నుంచి బాబుకి పిలుపు వచ్చిందా?
అవుననే అంటున్నాయి తెలుగుదేశం వర్గాలు. ఈరోజు హటాత్తుగా మారిన పరిణామాలు టిడిపి శ్రేణుల్లో ఉత్సాహం నింపాయి. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు సీట్ల కేటాయింపుపై చర్చలు జరుపుతున్నారు. ఈ ప్రక్రియ కొలిక్కి రావాలంటే బిజెపితో కూడా ఏదో ఒకటి తేలుకోవాలి అని బాబు భావిస్తున్నారు. అయితే గత అనుభవాల దృష్ట్యా తాను స్వయంగా బిజెపి పెద్దలతో మాట్లాడలేనని పవన్ కళ్యాణే మధ్యవర్తిత్వం చేయాలని చంద్రబాబు కొరినట్లుగా తెలుస్తోంది.
చంద్రబాబుతో ఒకసారి మాట్లాడాలి అని అమిత్ షా ని కోరినట్లుగా తెలుస్తోంది. అటునుంచి సానుకూల స్పందన రావడంతో రేపు రాత్రికి డిల్లీ చేరుకునేలా చంద్రబాబు ప్లాన్ చేసుకుంటున్నారట! ఆ తర్వాత పవన్ కూడా డిల్లీ చేరుకునే అవకాశం ఉంది. ఇద్దరు నేతలూ డిల్లీ నుంచి వచ్చాక ఈనెల 8 న మరోసారి భేటీ అయి సీట్ల పంపకాన్ని ఆదేరోజు ముగించే ఏర్పాట్లలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెపుతున్నాయి.
మొత్తానికి బిజెపి కూడా కూటమిలోకి రానుండడంతో ఏపీలో ఘన విజయం ఖాయం అని పార్టీ వర్గాలు ఆనందంగా ఉన్నాయి.