గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. ఒకప్పుడు రాజమండ్రి పట్టణాన్ని ఏలిన నేత! తెలుగుదేశం అంటే ఒకప్పుడు గోరంట్ల పేరే వినిపించేది.. విలువలకు గౌరవం ఇచ్చే పాత తరం మనిషి ఆయన! ఆనాడు ఎన్టీయార్ ను చంద్రబాబు మెజారిటీ ఎమ్మెల్యేలతో గద్దె దింపిన తర్వాత కూడా ఎన్టీయార్ తో నడిచిన నాయకుడాయన! ఆ తర్వాతి కాలంలో మళ్ళీ తెలుగుదేశంలో చేరారు.. అలాంటి నాయకుడిని బిజెపితో పొత్తు కారణంతో 2014లో నగరానికి బయటకు పంపించి రూరల్ టికెట్ ఇచ్చింది అధిష్టానం.. అసహనంతో, అసంతృప్తితో ఉన్నా చేసేది లేక గత కొద్ది ఎన్నికలనుంచి అక్కడే పోటీ చేసి గెలుస్తున్నారు.
ఇప్పుడు జనసేనతో పొత్తు ఆయన సీటుకి ఎసరు పెట్టింది.. ఈ విషయం ఆయన ధృష్టికి వచ్చినా సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లకు ఢోకా లేదు అని నమ్మారు. మళ్ళీ రూరల్ నుంచే పోటీ చేస్తాను అని ఖరాఖండీగా ఈ మధ్య జరిగిన విలేకర్ల సమావేశంలో కూడా చెప్పారు.
అయితే, నిన్న జరిగిన జనసేన సమావేశంలో పవన్ కళ్యాణ్ రాజమండ్రి రూరల్ అభ్యర్ధిగా జనసేన నుంచి కందుల దుర్గేష్ పోటీ చేస్తారని కార్యకర్తలతో చెప్పారు. ఇది తెలిసిన గోరంట్ల షాక్ అయ్యారు. ప్రస్తుతం ఆయన వ్యూహం ఎలా ఉందో తెలీలేదు.
రెండు సార్లు పొత్తుల కారణంతో సీటు కోల్పోయిన బుచ్చయ్య చౌదరి వైఖరి ఇప్పుడు ఎలా ఉందో బహుశా రెండు మూడు రోజుల్లో తెలుస్తుంది.
FLASH: రూరల్ సీటు ఖచ్చితంగా నాదే .. గోరంట్ల ట్వీట్
రాజమండ్రి రూరల్ తెలుగుదేశం కార్యకర్తలు కి అభిమానులకి శ్రేయోభిలాషులకు మనవి..
టీవి న్యూస్ ల లో వాట్స్ యాప్ మెసేజ్ ల్లో వస్తున్న వార్తలు అనేవి ఊహాజనితం..
అవి నమ్మి భావోద్వేగాల కి గురి అవ్వోద్దు.
నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం కచ్చితంగా “గోరంట్ల” పోటీ లో ఉంటారు…దీంట్లో…— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) February 20, 2024