Singeetam Srinivasa Rao: మరో అద్భుత ప్రయోగానికి సిద్ధమైన దర్శకుడు 93 ఏళ్ల ‘నవ యువకుడు

భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ ఆయన. ‘పుష్పక విమానం’, ‘ఆదిత్య 369’, ‘భైరవద్వీపం’, ‘మైఖేల్ మదన కామరాజు’ వంటి ఆణిముత్యాలను ప్రేక్షకులకు అందించిన ...

భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ ఆయన. ‘పుష్పక విమానం’, ‘ఆదిత్య 369’, ‘భైరవద్వీపం’, ‘మైఖేల్ మదన కామరాజు’ వంటి ఆణిముత్యాలను ప్రేక్షకులకు అందించిన దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావు.. 93 ఏళ్ల వయసులో మరోసారి మెగాఫోన్ పట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. సినిమా పట్ల ప్యాషన్‌కు వయసు అడ్డుకాదని నిరూపిస్తూ, తన పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమాను (#SSR61) అధికారికంగా ప్రకటించారు. ఇది ఆయన కెరీర్‌లో 61వ చిత్రం కావడం విశేషం.

ఈ చిత్రాన్ని టాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థలైన వైజయంతీ మూవీస్ (స్వప్న సినిమా) మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టి.జి. విశ్వప్రసాద్, స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (DSP) స్వరాలు సమకూరుస్తున్నారు. సింగీతం గారి వినూత్న ఆలోచనలకు, దేవిశ్రీ మాస్ బీట్స్ తోడైతే ఫలితం ఎలా ఉంటుందోనని ఆసక్తి నెలకొంది.

విడుదలైన అనౌన్స్‌మెంట్ వీడియోలో సింగీతం గారు ఉత్సాహంగా కనిపిస్తూ, ఒక చిన్న బొమ్మతో (పప్పెట్) సంభాషించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దీన్ని బట్టి, ఇది ‘ఆదిత్య 369’ తరహాలోనో లేదా అంతకు మించిన మరో సైన్స్ ఫిక్షన్/ఫాంటసీ కథతోనో తెరకెక్కనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Join WhatsApp Channel