మన దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ), సెంట్రల్ రిక్రూట్‌మెంట్ & ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్ సెంటర్ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఖాళీలను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ఒక భారీ ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1,511 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ లను నియమించనుంది. పూర్తి వివరాలు ..
మొత్తం పోస్టుల సంఖ్య: 1,511 పోస్టులు
పోస్టుల వివరాలు:
1. డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ అండ్ డెలివరీ: 187 పోస్టులు
2. డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ఇన్‌ఫ్రా సపోర్ట్ అండ్ క్లౌడ్ ఆపరేషన్స్: 412 పోస్టులు
3. డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- నెట్‌వర్కింగ్ ఆపరేషన్స్: 80 పోస్టులు
4. డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ఐటీ ఆర్కిటెక్ట్: 27 పోస్టులు
5. డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ: 07 పోస్టులు
6. అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్): 798 పోస్టులు
విభాగాలు :
అర్హత: బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయసు: 30.06.2024 నాటికి డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 25 నుంచి 35 ఏళ్లు; అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు డిప్యూటీ మేనేజర్‌లకు రూ.64,820- రూ.93,960. అసిస్టెంట్ మేనేజర్‌లకు రూ.48,480- రూ.85,920.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు : రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది).
దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో క్రింది లింకు ద్వారా
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 04.10.2024
వెబ్‌సైట్: https://sbi.co.in/web/careers/current-openings
నోటిఫికేషన్ వివరాలు: ఇక్కడ క్లిక్ చేయండి
ఆన్లైన్ అప్లికేషన్ లింకు – ఇక్కడ నుండి