India Pakistan War: LoC వెంబడి భీకర పోరు.. పూంఛ్ లో పౌరులపై కాల్పులు జరుపుతున్న పాక్

ఉగ్రవాద శిబిరాలపై భారత్ చేసిన “ఆపరేషన్ సిందూర్” కు ప్రతిగా పాకిస్తాన్ కాశ్మీర్ లోని పూంఛ్ సెక్టార్ లో LOC వెంబడి దాడులు ప్రారంభించింది.. అమాయక పౌరుల నివాసాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది.. దాదాపు 15 మంది సామాన్య పౌరులు మరణించగా .. 43 మంది గాయపడ్డట్టు తెలుస్తోంది. పాక్ సైన్యం స్కూల్, గురుద్వారా, నివాసాలను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరుపుతోంది.

ఉదయం నుంచి రోజంతా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఈ దాడులను భారత సైన్యం తిప్పికొడుతోంది. పాకిస్తాన్ వైపు మృతుల సమాచారం వెల్లడికాలేదు.

పహల్గావ్ లో ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత వారి స్థావరాలను లక్ష్యంగా చేసుకొని తుదముట్టించిన భారత్ ఎక్కడా పాక్ మిలిటరీ జోలికి పోలేదు. అయినా పాకిస్తాన్ మిలటరీ ఇప్పుడు మన దేశపౌరుల్ని చంపుతుంటే భారత్ సైన్యం ఇక ఊరుకోదు అనిపిస్తోంది.. ఇక యుద్దం మొదలైనట్లే.. పాకిస్తాన్ తన వినాశాన్ని తానే కోరుకోబోతోంది.

మరిన్ని అప్డేట్స్ ..

పూంఛ్ లోని ప్రభుత్వ ఆసుపత్రి క్షతగాత్రులతో నిండిపోయింది ..

Join WhatsApp Channel