నిన్న జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఇండియన్ ఐడోల్-12 విజేత పవన్ దీప్ రాజన్ కు తీవ్ర గాయాలయ్యాయి. డిల్లీ కి వెళ్తున్న ఆయన కారు ఉత్తరప్రదేశ్ లోని మోరదాబాద్ వద్ద నిన్న తెల్లవారుజామున ఆగి ఉన్న ట్రక్కుని ఢీ కొని ప్రమాదానికి గురి కాగా, ఆయన గాయాల పాలయ్యారు. చేతులకు, కాళ్ళకు తీవ్రమైన గాయాల పాలైన అతడిని హుటాహుటీన దగ్గరలోని ఆసుపత్రికి తరలించి, ప్రధమ చికిత్స అనంతరం డిల్లీ లోని ఆసుపత్రికి తరలించారు.
ఐసీయూలో ఆయనకు డాక్టర్లు ఆపరేషన్ చేసి పర్యవేక్షణలో ఉంచారు. త్వరలోనే పరిస్థితి మెరుగుపడుతుందని డాక్టర్లు చెప్పారు. ఉత్తరాఖండ్ కు చెందిన 28 సంవత్సరాల పవన్ దీప్ 2004 లో ఇండియన్ ఐడోల్-12 లో విజేతగా నిలిచి పలువురి ప్రశంసలు పొందారు. అటు తర్వాత అదే షోలో ఆయన మెంటర్ గా కొనసాగుతున్నారు.