Home » Nation » ‘భారత్ మారుతోంది..’ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్

‘భారత్ మారుతోంది..’ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్

by Eevela_team
DY Chandrachud

భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ త్వరలో అమలు కాబోతున్న మూడు కొత్త క్రిమినల్ చట్టాలను ప్రశంసించారు. ఈ కొత్త చట్టాలు మారుతున్న భారతదేశానికి సూచన అని ఆయన అన్నారు.

ఈరోజు న్యూడిల్లీలో న్యాయ మంత్రిత్వ శాఖ ఆద్వర్యంలో జరిగిన “క్రిమినల్ చట్టాల అమలుతో బారతదేశ అభివృద్ది పథం” అనే సదస్సులో పాల్గొన్న జస్టిస్ చంద్రచూడ్, “భారతదేశం మూడు కొత్త క్రిమినల్ చట్టాల అమలుతో తన నేర న్యాయ వ్యవస్థలో గణనీయమైన మార్పు రాబోతుంది.” అని అన్నారు.

మూడు చట్టాలు, అంటే, భారతీయ న్యాయ సంహిత, 2023; భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, 2023; మరియు భారతీయ సాక్ష్యా అధినియం, 2023, మునుపటి క్రిమినల్ చట్టాలను భర్తీ చేసింది, అవి ఇండియన్ పీనల్ కోడ్ 1860, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1973 మరియు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, 1872.

నోటిఫికేషన్ ప్రకారం, ఈ క్రిమినల్ చట్టాలు జూలై 1 నుండి అమలులోకి వస్తాయి

You may also like