Karthaveeryarjuna Stotram: కోల్పోయినవి తిరిగి పొందడానికి కార్తవీర్యార్జున స్తోత్రం PDF

Photo of author

Eevela_Team

Share this Article

కార్తవీర్యార్జున స్తోత్రం పఠించడం వల్ల దూరమైన వారు కానీ .. మనకు ఇష్టమైన పోయిన వస్తువులు కానీ .. తప్పిపోయిన పిల్లలు కానీ.. పోగొట్టుకున్న సొమ్ము కానీ .. తిరిగి పొందుతారు.

కార్తవీర్య అర్జునుడు ఎవరు?

హైహయ వంశీయుడైన కృతవీర్య రాజు గొప్ప చక్రవర్తి. ఆయన పుత్రుడే కార్తవీర్య అర్జునుడు. ఈయన శాపము చేత చేతులు లేకుండా జన్మించాడు. అయితే గొప్ప తపస్సుచేసి, దత్తాత్రేయుని ప్రసన్నము చేసుకొని, వెయ్యి చేతులను పొంది మహావీరుడైనాడు. రావణాసుసుని ఓడించి బంధించిన కార్తవీర్య అర్జునుడు దత్తాత్రేయ మహర్షి కి పరమ భక్తుడు. ఓటమి అనేది లేక చక్రవర్తిగా 85000 సంవత్సరాలకు పైగా ప్రపంచాన్ని పాలించాడు.

కార్తవీర్య అర్జునుడి వారసులు వృష్ణులు. వీరిలో భగవాన్ శ్రీకృష్ణుడు, బలరాముడు, కంసుడు, ఉగ్రసేనుడు, వాసుదేవుడు, సినీ, సాత్యకి, హృదక, కృతవర్మ, ప్రద్యుమ్నుడు, చారుదేష్ణ, సాంబ, మరియు అనిరుద్ధ రాజు అర్జునుడు, పాండు కుమారుడు. పాండవులలో ఒకరికి కార్తవీర్య అర్జున అనే పేరు పెట్టారు. కార్తవీర్య రాజు వలె, పాండవ అర్జునుడు కూడా అగ్ని యొక్క ఆకలిని తీర్చడానికి ఒక అరణ్యాన్ని (ఖాండవ) తగలబెట్టాడు.

కార్తవీర్యార్జున స్తోత్రం ఎలా పఠించాలి?

ఈ స్తోత్రం పారాయణం చేయువారు ఒక ఎర్రని కొత్త వస్త్రమును దర్భాసనంపై పరచి దానిపై కూర్చుని మొదట గణపతిని ప్రార్థించి ఆ తదుపరి కుడి చేయి గుప్పెట్లో కందుకు తీసుకుని చేతపట్టుకుని (ఏరోజుకారోజు) పారాయణం చేసి, తర్వాత చేతిలోనున్న కందులు ఒక డబ్బాలో పోసి జాగ్రత్త చేసి తర్వాత వచ్చే మంగళవారం రోజున గోవులకు ఆహారంగా ఇచ్చుట లేక నానబెట్టిన కందులు దానం ఇచ్చుట చేసిన అతి శీఘ్ర ఫలితములు అందగలవు..

మామూలుగా కూడా ఎన్ని సార్లు అయినా ఈ స్తోత్రం పఠించవచ్చు.

కార్తవీర్యార్జున స్తోత్రం

స్మరణ –
అర్జునః కృతవీర్యస్య సప్తద్వీపేశ్వరోఽభవత్ |
దత్తాత్రేయాద్ధరేరంశాత్ ప్రాప్తయోగమహాగుణః ||

న నూనం కార్తవీర్యస్య గతిం యాస్యంతి పార్థివాః |
యజ్ఞదానతపోయోగైః శ్రుతవీర్యదయాదిభిః ||

పంచాశీతిసహస్రాణి హ్యవ్యాహతబలః సమాః |
అనష్టవిత్తస్మరణో బుభుజేఽక్షయ్యషడ్వసు ||

ధ్యానమ్ –
సహస్రబాహుం మహితం సశరం సచాపం
రక్తాంబరం వివిధ రక్తకిరీటభూషమ్ |
చోరాదిదుష్టభయనాశనమిష్టదం తం
ధ్యాయేన్మహాబలవిజృంభితకార్తవీర్యమ్ ||

మంత్రం –
ఓం కార్తవీర్యార్జునో నామ రాజా బాహుసహస్రవాన్ |
తస్య సంస్మరణాదేవ హృతం నష్టం చ లభ్యతే ||

ద్వాదశనామాని –
కార్తవీర్యః ఖలద్వేషీ కృతవీర్యసుతో బలీ | [సహస్రాక్షః]
సహస్రబాహుః శత్రుఘ్నో రక్తవాసా ధనుర్ధరః || ౨ ||

రక్తగంధో రక్తమాల్యో రాజా స్మర్తురభీష్టదః |
ద్వాదశైతాని నామాని కార్తవీర్యస్య యః పఠేత్ || ౩ ||

[ అనష్టద్రవ్యతా తస్య నష్టస్య పునరాగమః | ]
సంపదస్తస్య జాయంతే జనాస్తస్య వశం గతః |
ఆనయత్యాశు దూరస్థం క్షేమలాభయుతం ప్రియమ్ || ౪ ||

యస్య స్మరణమాత్రేణ సర్వదుఃఖక్షయో భవేత్ |
యన్నామాని మహావీర్యశ్చార్జునః కృతవీర్యవాన్ || ౬ ||

హైహయాధిపతేః స్తోత్రం సహస్రావృత్తికారితమ్ |
వాంచితార్థప్రదం నౄణాం స్వరాజ్యం సుకృతం యది || ౭ ||

ఇతి కార్తవీర్యార్జున స్తోత్రమ్ |

కార్తవీర్యార్జున స్తోత్రం – Karthaveeryarjuna Stotram PDF Download

కార్తవీర్యార్జున మంత్రం

కార్తవీర్యార్జునో నామ రాజా బాహుసహస్రవాన్ |
తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే || 

Join WhatsApp Channel
Join WhatsApp Channel