తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 రేపటి నుంచి బుల్లితెరపై ప్రారంభం కానుంది. రేపు సాయంత్రం ప్రసారం అయ్యే ఎపిసోడ్ ను ఈరోజే చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. మొన్నటి నుంచి డ్యాన్స్ పర్ఫామెన్సెస్ జరుగుతున్నా ప్రారంభ ఎపిసోడ్ మాత్రం ఈరోజు నాగార్జునతో పాటూ చిత్రీకరిస్తారు.
రేపు 14 మందితో ప్రారంభం అయినా ముందు ముందు వైల్డ్ కార్డ్ ద్వారా మరికొంతమంది హౌస్ లోకి అడుగుపెడతారు.
ఈరోజు అడుగుపెడుతున్న 14 మంది కంటెస్టెంట్స్ లో ఆదిత్య ఓం, అభయ్ నవీన్, యాంకర్ విష్ణుప్రియ, యష్మీ గౌడ, ప్రేరణ కంబం, నిఖిల్ మలియక్కల్, ఆర్జే శేఖర్ బాషా, నైనిక అనరుసు, బెజవాడ బేబక్క, నాగ మణికంఠ, కిర్రాక్ సీత, పరమేశ్వర్ హివ్రాలే, సోనియా ఆకుల ఉన్నారు.