బిగ్బాస్ తెలుగు సీజన్ 8 ఎలిమినేషన్ రోజు వచ్చేసింది. గత ఆదివారం మొదలైన షోలో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు హౌజ్లోకి అడుగుపెట్టారు. ఒక్కరిగా కాక జంటలుగా ఏడుగురు అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలను హౌస్ లోకి పంపారు. గతంలోలాగా కాకుండా ఒకరోజు లేటుగా నామినేషన్లు జరిగాయి. మంగళవారం మొదలై.. బుధవారం ముగిశాయి. అంటే మొత్తంగా రెండు రోజుల పాటు ఈ నామినేషన్స్ జరిగి బుధవారం రాత్రి నుంచి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. ఆరుగురు నామినేట్ అయ్యారు. వారు.. విష్ణుప్రియ, నాగమణికంఠ, సోనియా, పృథ్వీరాజ్, శేఖర్ బాషా, బేబక్క. తర్వాత బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజుల పాటు ఓటింగ్స్ జరిగాయి.
ఇది చదవండి: Bigg Boss 8 Telugu Voting: Online Voting Poll and Results (Week 1) టాప్ లో విష్ణుప్రియ, మణికంఠ
అయితే అన్అఫీషియల్ పోల్స్ ప్రకారం చూస్తే.. నాగ మణికంఠ, యాంకర్ విష్ణుప్రియ మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇక మూడో స్థానంలో పృథ్వీరాజ్ ఉన్నారు. ఈ ముగ్గురూ సేవ్ అవ్వడం పక్కా. ఇకపోతే, చివరి మూడు స్థానాలకు కంటెస్టెంట్ల మధ్య తీవ్ర పోటీ జరుగుతోంది. సోనియా ఆకుల, శేఖర్ బాషా లతో పోలిస్తే బేబక్క కు కాస్త తక్కువగా వోట్లు పడుతున్నట్లు అర్ధం అవుతోంది. దీని ప్రకారం చూస్తే బేబక్క ఎలిమినేషన్ కావడం పక్కా!
అయితే సాధారణంగా మొదటి వారం ఎలిమినేషన్ ఉండదు అని అనుకోవచ్చు. ఒకవేళ గత సాంప్రదాయం ప్రకారం మొదటి వారం ఉండదు అని కొందరు విశ్లేషకులు అంటున్నారు. ఇలా జరిగితే మాత్రం బేబక్క ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నట్లే!