YSRCP PAC: మళ్ళీ సజ్జలకు పెద్దపీట.. వైఎస్సార్‌సీపీలో క్రొత్త నియామకాలు

Photo of author

Eevela_Team

Share this Article

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీలో పలు క్రొత్త నియామకాలు చేపట్టారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. 33 మందితో ‘పొలిటికల్ అడ్వైజరీ కమిటీ’ ని పునర్వ్యవస్థీకరించారు. కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డిని నియమించగా, ఇతర ప్రముఖ నాయకులను PAC మెంబర్లుగా పార్టీ నియమించింది.

PAC మెంబర్లుగా నియమితులైన వారు

1. తమ్మినేని సీతారాం
2. పీడిక రాజన్న దొర
3. బెల్లాన చంద్రశేఖర్
4. గొల్ల బాబురావు, ఎంపీ
5. బూడి ముత్యాలనాయుడు
6. పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ
7. పినిపే విశ్వరూప్
8. తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ
9. ముద్రగడ పద్మనాభం
10. పుప్పాల శ్రీనివాసరావు (వాసు బాబు)
11. చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు
12. కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని)
13. వెలంపల్లి శ్రీనివాస్
14. జోగి రమేష్
15. కోన రఘుపతి
16. విడదల రజిని
17. బొల్లా బ్రహ్మనాయుడు
18. ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎంపీ
19. నందిగం సురేష్ బాబు
20. ఆదిమూలపు సురేష్
21. పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్
22. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి
23. కళత్తూరు నారాయణ స్వామి
24.ఆర్కే రోజా
25. వైఎస్‌ అవినాష్ రెడ్డి, ఎంపీ
26. షేక్  అంజాద్ బాషా
27. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
28. అబ్దుల్ హఫీజ్ ఖాన్
29. మాలగుండ్ల శంకర నారాయణ
30. తలారి రంగయ్య
31. వై.విశ్వేశ్వర రెడ్డి
32. మహాలక్ష్మి శ్రీనివాస్
33. సాకే శైలజానాథ్

అలాగే కొన్ని కీలక నియోజక వర్గాలకు సమన్వయకర్తలను కూడా వైఎస్ జగన్ ఎంపిక చేశారు. అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపే విశ్వరూప్, కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షులుగా చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా డా. పినిపే శ్రీకాంత్ ను నియమించగా.. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా  షేక్ ఆసిఫ్‌, క్రమశిక్షణా కమిటీ సభ్యులుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నియమితులయ్యారు.

ఎక్కువమంది కార్యకర్తల విమర్శలు ఎదుర్కొంటున్న సజ్జలను ప్రధాన సలహాదారుగా నియమించడం గమనార్హం!

Join WhatsApp Channel
Join WhatsApp Channel