IPL 2025: Abhishek Sharma @ 141.. పంజాబ్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ ఘన విజయం

ఐపీఎల్‌-2025లో వరుస ఓటముల తర్వాత ఎట్టకేలకు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ రెండో గెలుపు సాధించింది. ఈరోజు ఉప్ప‌ల్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ 8 వికెట్ల తేడాతో భారీ విజ‌యాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ విజ‌యంలో కీలక పాత్ర పోషించిన స్టార్ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ(141) అద్భుత‌మైన సెంచ‌రీతో కొన్ని అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

  • కేవ‌లం 55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్‌ల‌తో 141 ప‌రుగులు చేసిన అభిషేక్ ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఇండియన్ ప్లేయర్‌గా రి​కార్డులకెక్కాడు. ఇప్పటిదాకా కేఎల్ రాహుల్‌(132) పేరిట ఉన్న ఈ రికార్డును అభిషేక్ చెరిపివేశాడు.

IPL చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు

1 క్రిస్ గేల్ 175* RCB vs వారియర్స్

2 బ్రెండన్ మెకల్లమ్ 158* KKR vs RCB

3 అభిషేక్ శర్మ 141 SRH vs PBKS

4 క్వింటన్ డి కాక్ 140* LSG vs KKR

5 AB డివిలియర్స్ 133* RCB vs MI

6 లోకేష్ రాహుల్ 132* KXIP vs RCB

7 AB డివిలియర్స్ 129* RCB vs GL

8 శుబ్మాన్ గిల్ 129 GT vs MI

9 క్రిస్ గేల్ 128* RCB vs DD

10 రిషబ్ పంత్ 128* DD vs SRH

  • అలాగే ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన మూడో భారత బ్యాట్స్మెన్ గా అభిషేక్ రికార్డు సృష్టించాడు. 40 బంతుల్లో సెంచరీ చేసి ఈ జాబితాలో యూస‌ఫ్ ప‌ఠాన్‌(37 బంతులు) , ప్రియాన్ష్ ఆర్య(38 బంతులు) ల తర్వాతి స్థానాన్ని పొందాడు.
  • అంతేకాదు ఐపీఎల్‌లో ఛేజింగ్‌లో అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోర్ సాధించిన ప్లేయ‌ర్‌గా కూడా అభిషేక్ ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా స్టార్ ప్లేయ‌ర్ మార్కస్ స్టోయినిస్(124) పేరిట ఉన్న ఈ రికార్డును తాజా మ్యాచ్‌తో అభిషేక్ శ‌ర్మ అధిగ‌మించాడు.
Join WhatsApp Channel