వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత అంశం ఈ నెల 19వ తేదీన కొలిక్కివచ్చే అవకాశం ఉంది. ఆరోజు తుది విచారణకు హాజరు కావాలని స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి రెబల్ ఎమ్మెల్యే లైన వైసీపీ రెబెల్స్ ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలకు నోటీసులు జారీ చేశారు. దీనిలోఈ నెల 19వ తేదీన మధ్యాహ్నం జరిగే తుది విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. విచారణకు హాజరు కాకుంటే ఇప్పటి వరకు తాను విన్న వాదనల ఆధారంగా పిటిషన్లపై నిర్ణయం తీసుకుంటానని నోటీసు ద్వారా స్పీకర్ స్పష్టం చేశారు. మరోవైపు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ ఇచ్చిన చీఫ్ విప్ ప్రసాద రాజుకు కూడా స్పీకర్ నోటీసులు జారీ చేశారు.
YSRCP రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై 19న తుది విచారణ, మళ్ళీ నోటీసులు
Share this Article