Andhra PradeshPoliticstrending

YS Jagan: జగన్ స్వయం కృపరాధం .. వైసీపీ కనుమరుగు కానుందా ?!

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న పార్టీ ఇలాంటి కనీ వినీ ఎరుగని ఘోర పరాజయం చవి చూసి ఉండదు. వైసీపీ ఇంతటి ఘోర పరాజయానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. 

దానిలో మొదటి కారణం జగనే .. ఖచ్చితంగా తను నిర్మించిన పార్టీని తానే నాశనం చేసుకున్నాడు జగన్. 

తనను నమ్ముకున్న నాయకులను వదులుకోవడం.. 

అతి పబ్లిసిటీ .. 

చుట్టూ ఉన్న భజన కోటరీ.. 

ప్రజల్లో వ్యతిరేకతను గుర్తించలేని ఐప్యాక్ టీం .. 

ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోక పోవడం .. 

కలుపుకుపోయే వ్యక్తిత్వం లేకపోవడం .. 

లాంటి ఎన్నో అంశాలు జగన్ కొంప ముంచాయి.  ఈ పరాజయం జగన్ కి మాత్రమే నష్టం కలిగించదు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ని కనుమరుగు చేసినా ఆశ్చర్యం లేదు.. 

ప్రస్తుతం టిడిపి కూటమి అధికారం లోకి వచ్చినా భవిష్యత్ లో ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం జనసేన-బిజెపిలు టిడిపితో వేరుపడి టిడిపికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడితే తన ధోరణి మార్చుకోక పోతే జగన్ దానిలో వెనుకబడడం ఖాయం.. సరి అయిన కార్యకర్తలను ఇప్పటిదాకా నిర్మించుకోలేక ఉన్నవారిని నిలబెట్టుకోలేక పోయిన వైసీపీ పార్టీ, ఉన్న కొద్దిపాటి నాయకులను కూడా దూరం చేసుకుంటే  దానికి కారణం ఖచ్చితంగా జగనే అవుతాడు.. 

One thought on “YS Jagan: జగన్ స్వయం కృపరాధం .. వైసీపీ కనుమరుగు కానుందా ?!

  • ఈ పిచ్చిజనాన్ని పాలించమని దేవుడు నన్ను పంపాడూ కాదనటానికి ఆ విపక్షాల కేమి హక్కుందీ, ఈ ప్రజల కేమి హక్కుందీ అనే అహంకారం వదలకపోతే అంతే సంగతులు మరి.

Comments are closed.