Gali Janardhan Reddy:15 ఏళ్ల తర్వాత ఓబులాపురం మైనింగ్ కేసులో తీర్పు.. గాలి జనార్దన్ కు ఏడేళ్ళ జైలు శిక్ష

15 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం తర్వాత ఓబుళాపురం మైనింగ్‌ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన ఈ మైనింగ్ కేసులో a2 గా ఉన్న గాలి జనార్ధన్ రెడ్డి సహా ఐదుగురికి సీబీఐ కోర్టు శిక్షలు ఖరారు చేసింది. అయితే ఇదే కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి కృపానందంలను నిర్దోషులుగా ప్రకటించింది.

దోషులుగా ప్రకటించిన గాలి జనార్ధన్ రెడ్డి (ఏ2), ఆయన పీఏ అలీఖాన్ (ఏ7)), వి.డి.రాజగోపాల్ (ఏ3), శ్రీనివాస్ రెడ్డి (ఏ1) లకు ఏడేళ్ళ జైలు శిక్ష ఖరారు చేస్తూ తీర్పు చెప్పింది సీబీఐ కోర్టు.

అనంతపురం జిల్లా కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసును సీబీఐ దర్యాప్తు చేసింది. ఈ కేసులో లుగా మొత్తం తొమ్మిది మంది నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని ఇప్పటికే హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. వీరిలో ఒక నిందితుడు (లింగారెడ్డి) మృతి చెందారు.

Join WhatsApp Channel