అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపై మొదటి సంతకం పెడతానని ఇచ్చిన హామీని
సీఎం చంద్రబాబు నెరవేర్చారు. సచివాలయంలో గురువారం ఆ దస్త్రంపైనే తొలి సంతకం
చేశారు. అన్ని రకాల ఉపాధ్యాయ పోస్టులు కలిపి 16,347 భర్తీ చేయనున్నారు. 6100 పోస్టుల భర్తీకి గతంలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవరిస్తూ కొత్త నోటిఫికేషన్ జారీ చేశారు.
డీఎస్సీ పోస్టుల వివరాలు ఇవే:
1. ఎస్‌జీటీ : 6,371
2. పీఈటీ : 132
3. స్కూల్ అసిస్టెంట్స్ 7725
4. టీజీటీ: 1781
5. పీజీటీ: 286
6. ప్రిన్సిపల్స్: 52
ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబరు 31
నాటికి పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
నీరభ్‌కుమార్ ప్రసాద్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి
చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ను ఆదేశించారు. డీఎస్సీ
ప్రకటన నుంచి పోస్టుల భర్తీ వరకు మొత్తం ప్రక్రియను 6 నెలల్లోపే పూర్తి
చేయనున్నారు. పోస్టుల భర్తీకి ప్రభుత్వమే నిర్దిష్ట సమయాన్ని
నిర్ణయించింది.