AP Home Guard Jobs : ఆంధ్రప్రదేశ్‌లో హోంగార్డ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

Photo of author

Eevela_Team

Share this Article

AP Home Guards Recruitment Notification 2025 : ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ (AP CID) విభాగంలో 28 హోంగార్డు పోస్టుల భర్తీకి పోలీసు శాఖ సోమవారం (ఏప్రిల్‌ 28) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన మహిళా, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 50 ఏళ్ల లోపు వయస్సు ఉండాలి. పురుష అభ్యర్థులు 160, మహిళా అభ్యర్థులు 150 సెం.మీ.. ఎత్తు ఉండాలి. ఎస్‌టీ మహిళలకు 5 సెం.మీ సడలింపు ఉంటుంది. దరఖాస్తుదారులకు కంప్యూటర్‌ పరిజ్ఞానం, లైట్‌, హెవీ మోటారు వాహన డ్రైవింగ్‌ లైసెన్స్‌ తప్పనిసరిగా ఉండాలి.

మొత్తం పోస్టుల సంఖ్య: 28

పోస్టుల వివరాలు: హోంగార్డు

విభాగాలు : ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ విభాగం

అర్హత: ఇంటర్మీడియట్‌ పాస్

వయసు: 18 నుంచి 50 ఏళ్ళు

జీతం: రూ.710/- రోజుకు

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: మే 15, 2025

వెబ్‌సైట్‌: https://cid.appolice.gov.in

నోటిఫికేషన్ వివరాలు:  

NOTIFICATION for Enrollment of Home Guards in CID, AP

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏపీ పోలీస్‌ సీఐడీ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థులకు కంప్యూటర్‌, టైపింగ్‌, డ్రైవింగ్‌ పరీక్ష నిర్వహించి తుది ఎంపిక చేస్తామని సీఐడీ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ తెలిపారు. పూర్తి వివరాల కోసం 94407 00860 నంబర్‌కు ఆఫీసు పనివేళల్లో సంప్రదించవచ్చని సూచించారు.

Join WhatsApp Channel
Join WhatsApp Channel