29.2 C
Hyderabad
Thursday, February 12, 2026
HomeAndhra PradeshAP CEO Press meet: రాష్ట్రంలో పోలింగ్ శాతం పెరిగింది.. రీపోలింగ్ అవసరం లేదు -...

AP CEO Press meet: రాష్ట్రంలో పోలింగ్ శాతం పెరిగింది.. రీపోలింగ్ అవసరం లేదు – ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి

 

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. దీనిపై ఏపీ ప్రధాన ఎన్నికల
అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా మీడియా సమావేశం విరవహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాయంత్రం 5 గంటల సమయానికి 75 శాతం నమోదైందని, ఓటర్ల నమోదు
ముందుగా చేపట్టడంతోఇలా పోలింగ్ శాతం గతంతో పోలిస్తే పెరిగింది అని చెప్పారు. 

రాష్ట్రంలో చెదురుముదురు ఘటనలు మినహా ఎన్నికలు
ప్రశాంతంగా ముగిసాయని ఆయన చెప్పారు. 

పల్నాడులో 12 చోట్ల ఘర్షణలు జరిగాయి.
పల్నాడులో ఒక చోట ఈవీఎంను ధ్వంసం చేశారు. ఈవీఎంలోని చిప్‌లో డేటా భద్రంగా
ఉంది. ఈవీఎంలను మార్చి మళ్లీ పోలింగ్‌ ప్రారంభించాం. కొన్ని చోట్ల ఇంకా
పోలింగ్‌ కొనసాగుతోంది. అన్నమయ్య జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది.
అక్కడ మిషన్లు మార్చి పోలింగ్‌ పునరుద్ధరించాం. పల్నాడు, అనంతపురం,
తెనాలిలో కొందరిని గృహ నిర్బంధం చేశారు’’ అని ఏపీ సీఈవో వెల్లడించారు.

ఎక్కడా రీ పొలింగ్‌ కోసం విజ్ఞప్తులు రాలేదని,  స్ట్రాంగ్‌ రూమ్‌లోకి ఈవీఎంల తరలింపు ప్రక్రియ ప్రస్తుతం జరుగుతున్నదని  ఎంకే మీనా వెల్లడించారు.

 

ఓ లుక్కేయండి

తాజా వార్తలు

Join WhatsApp Channel