ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం .. నాలుగోసారి

Photo of author

Eevela_Team

Share this Article

 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం
చేశారు. బుధవారం ఉదయం గన్నవరం కేసరపల్లి ఐటీ పార్క్‌ వద్ద అత్యంత వైభవంగా ప్రమాణ
స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ చంద్రబాబు చేత
సీఎంగా ప్రమాణం చేయించారు. ఏపీ ఎన్డీయే కూటమి శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన
చంద్రబాబు.. ప్రధాని మోదీ సమక్షంలో ప్రమాణ స్వీకారం  చేశారు. 

ఆయనతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్య మంత్రిగా ప్రమాణం చేశారు. వీరితో పాటూ కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్‌(జనసేన), పి.నారాయణ, వంగలపూడి అనిత,
సత్యకుమార్‌ యాదవ్‌(బీజేపీ), నిమ్మల రామానాయుడు, మహ్మద్‌ ఫరూఖ్‌, ఆనం
రాంనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్‌, అనగాని సత్యప్రసాద్‌, కొలుసు
పార్థసారథి, బాల వీరాంజనేయ స్వామి, ఆనం రాంనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్‌,
అనగాని సత్యప్రసాద్‌, కొలుసు పార్థసారథి, డి బాల వీరాంజనేయ స్వామి,
గొట్టిపాటి రవికుమార్‌, కందుల దుర్గేష్‌(జనసేన), గుమ్మడి సంధ్యారాణి, బీసీ
జనార్ధన్‌రెడ్డి, టీజీ భరత్‌, ఎస్‌ సవిత, వాసంశెట్టి సుభాష్‌, కొండపల్లి
శ్రీనివాస్‌, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి.. ఒకరి తర్వాత ఒకరు మంత్రులుగా
ప్రమాణం చేశారు. 

మంత్రులందరూ ప్రమాణం చేసిన తర్వాత ప్రధాని మోదీ, రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌
నజీర్‌, చంద్రబాబు కొత్త కేబినెట్‌తో కలిసి గ్రూప్‌ ఫొటో దిగారు. ఈ ప్రమాణ
స్వీకార కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, జేపీ
నడ్డా తదితరులు, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, తమిళనాడు మాజీ సీఎం
పన్నీరు సెల్వం, తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై తదితర మాజీ ఉపరాష్ట్రపతి
వెంకయ్యనాయుడు, సుప్రీం కోర్టు మాజీ సీజే ఎన్వీ రమణ, చంద్రబాబు సతీమణి నారా
భువనేశ్వరి, చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ, మూడు పార్టీల కీలక
నేతలు  హాజరయ్యారు. సినీ రంగం నుంచి చిరంజీవి, రజినీకాంత్‌, నారా ఫ్యామిలీ,
మెగా ఫ్యామిలీ ఈ కార్యక్రమంలో పాల్గొంది. 

Join WhatsApp Channel
Join WhatsApp Channel