కేవలం 24 సీట్లతో సరిపెట్టుకుని కాపుల ఆగ్రహానికి గురవుతున్న జనసేనతో బిజెపి తెగతెంపులు చేసుకోడానికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కనీసం పవన్ కళ్యాణ్ ని కలవడానికి కూడా బిజెపి అధినాయకత్వం ఇష్టపడడం లేదు. అమిత్ షా పవన్ ని దూరం పెడుతూనే ఉన్నారు. ఇప్పటికే కాపులు పవన్ తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. దీన్ని బిజెపి తనకు అనువుగా మార్చుకోవాలని అనుకుంటోంది. నిజానికి టిడిపితో జతకట్టడం ఆ పార్టీకి అస్సలు ఇష్టం లేదు. ప్రస్తుతం ఆగ్రహంగా ఉన్న కాపు నాయకులను తమవైపు తిప్పుకుని రాస్ట్రంలో పుంజుకోవాలని తీవ్రంగా ఆలోచిస్తున్నారు ఆ పార్టీ నాయకులు.
ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్య వంటి నేతలతో పాటూ చిరంజీవిని కూడా ఆకర్షించే పనిలో ఉంది ఆ పార్టీ. ఈ అంశంలో రాబోయే రెండు మూడు రోజుల్లో పెద్ద సంచలనమే చేయబోతోంది బిజెపి. ఇప్పటికే మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమైన ఆ పార్టీకి కేంద్ర స్థాయిలో పదవులు ఎరవేసి ముఖ్యనాయకులను తమవైపు తిప్పుకోవడం కష్టం ఏమీ కాదు అంటున్నారు విశ్లేషకులు.