ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్ని జిల్లాలనూ పూర్తిగా పునర్వ్యవస్ఠీకరణ దిశగా పావులు కడుపుతుందా?
అవుననే అంటున్నారు.. జిల్లాల ఏర్పాటులో జగన్ ముద్రను చెరిపివేసే దిశగా చంద్రబాబు పావులు కదుపుతున్నారని విశ్లేషకులు రూఢీగా చెపుతున్నారు ..
రాస్ట్రంలో జిల్లాల విభజన జరిగింది కానీ దానిపై రాష్ట్రపతి ఇప్పటి దాకా ఆర్డర్ జారీ చేయలేదు. దీన్ని అవకాశంగా తీసుకుని మరోసారి జిల్లాలను పూర్తిగా మార్చనున్నారు. ఈసారి 27 లేదా 28 జిల్లాలు వచ్చే అవకాశం ఉంది .
కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి జారీ చేసిన ఒక నోటిఫికేషన్, ఈ అనుమానాలకు తావిస్తోంది.
ఇంజినీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియలో కొన్ని మండలాలు వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి తొలగించి ఆంధ్ర యూనివర్సిటీ లో చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు పాత 13 జిల్లాల ఆధారంగా అడ్మిషన్ విధానం కొనసాగుతుంది అని వివరించింది.