మొత్తానికి మైలవరం ఎమ్మెల్యే తాను పార్టీ మారుతున్నానని క్లారిటీ ఇచ్చేశారు. ఈరోజు కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనను పార్టీ హై కమాండ్ ఇబ్బంది పెట్టిందని, జోగి రమేష్ ఎన్ని కుట్రలు చేసినా వెనకేసుకొచ్చింది అని అన్నారు. ఏ పార్టీలోకి వెళ్ళేది త్వరలో చెపుతాను అని అన్నారు.
అయితే వసంత కృష్ణ ప్రసాద్ ఇప్పటికే టిడిపి లో చేరారు అని ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు ఒక విలేఖరితో చెప్పడం గమనార్హం.