బెంగళూరులోని మహాదేవపుర ప్రాంతంలో 12 ఏళ్ల బాలుడిపై రాట్‌వీలర్ (Rottweiler) జాతికి చెందిన పెంపుడు కుక్క తీవ్రంగా దాడి చేసి కరిచింది. జూన్ 13న నివాసిత ప్రాంతంలోని ఒక వీధిలో బాలుడు సైకిల్ తొక్కుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇదంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఒక ఇంటి నుంచి అకస్మాత్తుగా బయటకు పరిగెత్తుకుంటూ వచ్చిన ఆ కుక్క.. బాలుడిని వెంబడించి కాలుపై కరిచినట్లు ఆ ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ దాడిలో బాలుడికి గాయాలు కాగా, వెంటనే అతనికి వైద్య చికిత్స అందించారు. ఈ ఘటన తర్వాత, పెంపుడు కుక్కను అదుపులో ఉంచడంలో, అలాగే ప్రజా భద్రతను నిర్ధారించడంలో విఫలమయ్యారన్న ఆరోపణలపై కుక్క యజమానిపై అధికారులు నిర్లక్ష్యం కింద కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.
A 12-year-old boy was attacked & bitten by a pet Rottweiler in #Bengaluru's Mahadevapura. The incident caught on CCTV took place on June 13 when the boy was cycling on the street. The dog ran out of the house and bit the boy on his leg. Owner booked for negligence #Karnataka pic.twitter.com/3dPFIwut3u
— Imran Khan (@KeypadGuerilla) June 17, 2026



