దేవుడిపై భక్తి కేవలం మనుషులకే పరిమితమా? అంటే ‘కాదు’ అని నిరూపిస్తోంది ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఒక ఆశ్చర్యకరమైన సంఘటన. సాధారణంగా గుడికి వెళ్తే దేవుని చుట్టూ ప్రదక్షిణలు చేసేది భక్తులు మాత్రమే. కానీ, ఓ మూగజీవం సాక్షాత్తు ఆంజనేయ స్వామి విగ్రహం చుట్టూ భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణలు చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఆలయంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఆంజనేయ స్వామి ఆలయం వెలుపల ఉన్న హనుమంతుని విగ్రహం వద్ద ఈ వింత చోటుచేసుకుంది. ఒక వీధి కుక్క అక్కడ ఉన్న హనుమంతుని విగ్రహం చుట్టూ నిష్ఠగా తిరుగుతూ కనిపించింది. ఆ కుక్క ఎవరినీ కరవలేదు, అరవలేదు. అత్యంత ప్రశాంతంగా, తల వంచుకుని విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంది. అది చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. కుక్క ప్రవర్తన అచ్చం ఓ భక్తుడు దేవుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లే ఉందని స్థానికులు చెబుతున్నారు.
ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు “జై శ్రీరామ్”, “జై బజరంగబలి” అంటూ నినాదాలు చేశారు. ఇది కలియుగ మహిమ అని, ఆ కుక్క పూర్వజన్మలో గొప్ప భక్తుడై ఉంటాడని అక్కడి వారు చర్చించుకుంటున్నారు. కొంతమంది భక్తులు ఆ కుక్కకు ఆహారం పెట్టేందుకు ప్రయత్నించినా, అది అవేమీ పట్టించుకోకుండా తన ప్రదక్షిణలను కొనసాగించడం విశేషం. దాదాపు చాలా సేపు ఆ కుక్క అలా విగ్రహం చుట్టూ తిరుగుతూనే ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఈ ఘటనను అక్కడున్న కొందరు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. క్షణాల్లోనే ఈ వీడియో వైరల్ అయ్యింది. నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
- “మనుషులు దేవుణ్ణి మర్చిపోతున్నారు, కానీ జంతువులకు దైవభక్తి ఉంది,” అని ఒకరు కామెంట్ చేయగా..
- “ఇది కచ్చితంగా హనుమంతుని లీల. ఆ కుక్క రూపంలో ఎవరో సిద్ధపురుషుడు వచ్చి ఉంటారు,” అని మరొకరు అభిప్రాయపడ్డారు.
BIG NEWS 🚨 A dog has been continuously circling Hanuman Ji’s idol at Bijnor’s ancient Hanuman temple for the past four days 😳
— News Algebra (@NewsAlgebraIND) January 15, 2026
Devotees are calling it a miracle. pic.twitter.com/WgPs3tcErv

