20.7 C
Hyderabad
Monday, February 16, 2026
HomeWorldఇరాన్‌పై సైనిక చర్యలు చేపట్టండి: అమెరికాకు చివరి షా కుమారుడి విజ్ఞప్తి

ఇరాన్‌పై సైనిక చర్యలు చేపట్టండి: అమెరికాకు చివరి షా కుమారుడి విజ్ఞప్తి

మ్యూనిచ్: ఇరాన్‌లో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా అమెరికా తక్షణమే సైనిక జోక్యం చేసుకోవాలని ఇరాన్ చివరి షా కుమారుడు రెజా పహ్లావి విజ్ఞప్తి చేశారు. మ్యూనిచ్ భద్రతా సదస్సు సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇరాన్ ప్రభుత్వంతో అణు ఒప్పంద చర్చల పేరిట కాలయాపన చేయవద్దని డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగాన్ని కోరారు.

ఇరాన్‌లోని మతతత్వ ప్రభుత్వం పతనం అంచున ఉందని, అమెరికా సైనిక దాడి చేస్తే ఆ ప్రక్రియ వేగవంతం అవుతుందని పహ్లావి అభిప్రాయపడ్డారు. ప్రజలు తిరిగి వీధుల్లోకి వచ్చి పోరాడేందుకు ఇది దోహదపడుతుందన్నారు.

గత డిసెంబర్ నుంచి ఇరాన్‌లో ఆర్థిక ఇబ్బందులకు వ్యతిరేకంగా మొదలైన నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. దీనిని అణచివేసేందుకు ప్రభుత్వం సాగించిన అరెస్టుల పర్వంలో వేలాది మంది జైలు పాలయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే, ఇరాన్‌లో పహ్లావికి ఎంతమేర ప్రజా మద్దతు ఉందనే విషయంపై అధ్యక్షుడు ట్రంప్ గతంలో సందేహాలు వ్యక్తం చేశారు. ఇరాన్ ప్రతిపక్షాలు వివిధ వర్గాలుగా విడిపోయి ఉండటం కూడా గమనార్హం.

ఓ లుక్కేయండి

తాజా వార్తలు

Join WhatsApp Channel