18.7 C
Hyderabad
Thursday, January 15, 2026
HomeWorldఇరాన్‌ను వెంటనే వీడండి: భారతీయులకు ఎంబసీ అత్యవసర హెచ్చరిక - యుద్ధ మేఘాల నేపథ్యంలో కీలక...

ఇరాన్‌ను వెంటనే వీడండి: భారతీయులకు ఎంబసీ అత్యవసర హెచ్చరిక – యుద్ధ మేఘాల నేపథ్యంలో కీలక నిర్ణయం!

పశ్చిమ ఆసియాలో, ముఖ్యంగా ఇరాన్‌లో నెలకొన్న అత్యంత ప్రమాదకర పరిస్థితుల దృష్ట్యా భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇరాన్‌లో నివసిస్తున్న భారత పౌరులకు టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy in Tehran) మంగళవారం ఒక అత్యవసర ప్రకటన జారీ చేసింది. ఇరాన్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, పౌర నిరసనలు మరియు పొంచి ఉన్న యుద్ధ ముప్పు నేపథ్యంలో.. వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని భారతీయులను కోరింది.

“ఇరాన్‌లో నెలకొన్న తాజా భద్రతా పరిస్థితుల దృష్ట్యా, అక్కడ నివసిస్తున్న భారతీయ పౌరులు అప్రమత్తంగా ఉండాలి. వారి భద్రత కోసం, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాణిజ్య విమానాల (Commercial Flights) ద్వారా ఇరాన్ నుండి నిష్క్రమించాలని సూచించడమైనది” అని పేర్కొంది. విమాన సర్వీసులు ఇంకా నడుస్తున్నప్పుడే దేశం దాటాలని, పరిస్థితులు మరింత దిగజారితే చిక్కుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

ఓ లుక్కేయండి

తాజా వార్తలు

Join WhatsApp Channel