17.7 C
Hyderabad
Thursday, February 12, 2026
HomeWorldDonald Trump: భారత్-పాక్ మధ్య అణుయుద్ధం తప్పింది.. 10 విమానాలు కూల్చేశారు: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Donald Trump: భారత్-పాక్ మధ్య అణుయుద్ధం తప్పింది.. 10 విమానాలు కూల్చేశారు: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

  • భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలను చల్లార్చింది తానేనని ట్రంప్ వెల్లడి.
  • సుంకాలు విధిస్తాననే భయంతో యుద్ధం ఆగిందని వ్యాఖ్య.
  • ఆ సమయంలో 10 యుద్ధ విమానాలు కూల్చివేయబడ్డాయని సంచలన నిజం.
  • పాక్ ప్రధాని తనకు కృతజ్ఞతలు తెలిపారని ట్రంప్ ప్రస్తావన.

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ మరియు పాకిస్థాన్ మధ్య జరగాల్సిన భీకర యుద్ధాన్ని తానే అడ్డుకున్నానని, లేకపోతే అది అణుయుద్ధంగా మారి ఉండేదని ఆయన పేర్కొన్నారు. వాణిజ్య సుంకాల హెచ్చరికలతో ఇరు దేశాలను దారికి తెచ్చానని ట్రంప్ వెల్లడించారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ‘ఫాక్స్ బిజినెస్’ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్-పాకిస్థాన్ సంబంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది మే నెలలో ఇరు దేశాల మధ్య పరిస్థితులు చేయి దాటిపోయాయని, ఆ సమయంలో తాము జోక్యం చేసుకోకపోతే అణుయుద్ధం జరిగి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు.

“సుంకాలు విధిస్తామంటేనే వెనక్కి తగ్గారు..”

తాను ఇప్పటివరకు ఎనిమిది యుద్ధాలను నిలిపివేశానని, అందులో ఆరు యుద్ధాలు కేవలం ‘సుంకాలు’ విధిస్తామన్న హెచ్చరికలతోనే ఆగిపోయాయని ట్రంప్ తెలిపారు. “మీరు గొడవ ఆపకపోతే, మీపై భారీగా సుంకాలు విధిస్తాను.. ప్రజలు చనిపోవడం నాకు ఇష్టం లేదు” అని ఇరు దేశాల అధినేతలకు చెప్పినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు.

భారత్-పాక్ గొడవ గురించి ప్రస్తావిస్తూ.. “వారిద్దరూ భీకరంగా పోరాడుతున్నారు. దాదాపు 10 విమానాలు కూల్చివేయబడ్డాయి. నా అభిప్రాయం ప్రకారం అది కచ్చితంగా అణుయుద్ధంగా మారేది. కానీ నేను మధ్యవర్తిత్వం వహించి సుంకాల అస్త్రాన్ని ప్రయోగించడంతో వారు శాంతించారు” అని ట్రంప్ పేర్కొన్నారు.

“10 మిలియన్ల ప్రాణాలు కాపాడారు..”

యుద్ధం ఆగిపోయిన తర్వాత పాకిస్థాన్ ప్రధాని తనతో మాట్లాడుతూ.. “అధ్యక్షా, మీరు మా గొడవను ఆపి దాదాపు కోటి (10 మిలియన్ల) మంది ప్రాణాలను కాపాడారు” అని చెప్పినట్లు ట్రంప్ ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఓ లుక్కేయండి

తాజా వార్తలు

Join WhatsApp Channel