
Tamil Nadu tragedy: కార్ ఎయిర్ బేగ్ పేలి బాలుడి మృతి… పిల్లల్ని ముందు సీట్లో కూర్చో పెట్టొద్దు
కారు ముందు సీట్లో తండ్రి ఒడిలో కూర్చున్న బాలుడు… డ్రైవర్ సడెన్ బ్రేక్ వేసేసరికి ఎయిర్ బేగ్ అత్యవసరంగా తెరుచుకుని మృతి చెందిన సంఘటన, చూసిన అందరినీ కలచివేసింది. ఇది నిన్న (అక్టోబర్ 14) తమిళనాడులో జరిగింది.
వార్తల ప్రకారం, తమిళనాడులో తిరుపోరూర్ నియోజక ప్రాంతంలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న ఓ ప్రమాదంలో, ఒక 7 ఏళ్ల బాలుడు మృతిచెందాడు. వారు ప్రయాణిస్తున్న కారు ముందుగా వచ్చిన వాహనాన్ని డీకొనడంతో ఏయిర్ బ్యాగ్ సడన్‌గా పేలగా ముందు సెట్లో తండ్రి తొడపై కూర్చున్న బాలుడు తీవ్ర గాయాలతో మరణించాడు.
గతంలో ఇదే తరహ దుర్ఘటన ముంబైలో కూడా జరిగింది.
భద్రతా నిర్ణయాలు & ముఖ్య సూచనలు
- చిన్న వయసున్న పిల్లలను వెనుక సీటులో, చైల్డ్ సీట్ (Child Seat / Booster Seat) లో కూర్చోవాలి.
- వాహనంలో సెఫ్టీ బెల్ట్లు తప్పక కట్టించాలి.
- వాహనం సర్వీస్ చేయించేటప్పుడు ఏయిర్ బ్యాగ్ వ్యవస్థ తనిఖీ చేయించాలి.
- ట్రాఫిక్ నియమాలు పాటించాలి.. వేగ పరిమితి, బ్రేకింగ్ జాగ్రత్తలు, ముందు వెనక కార్లతో దూరం పాటించడం వంటివి.
- పిల్లలను ముందు సీటులో ఎప్పటికీ కూర్చోనివ్వకూడదు.