Eenadu 50 Years: విలువలు, విశ్వసనీయతే ‘ఈనాడు’ కు కవచాలు: పవన్‌ కల్యాణ్‌

Photo of author

Eevela_Team

Share this Article

‘ఈనాడు’ దినపత్రిక 50 వసంతాలు పూర్తి చేసుకొని స్వర్ణోత్సవాలు చేసుకుంటున్న సందర్భంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ‘ఈనాడు’ యాజమాన్యానికి, పాత్రికేయులకు, సిబ్బందికి స్వర్ణోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ విశాఖ సాగర తీరంలో ఆవిర్భవించిన ‘ఈనాడు’జనహితమే లక్ష్యంగా… ఉషోదయాన తెలుగు లోగిల్లను చేరుతోందని పేర్కొన్నారు.. ప్రారంభమైన నాటి నుంచే పత్రిక వ్యవస్థాపకులు రామోజీరావు ‘ఈనాడు’కు విలువలు, విశ్వసనీయతను కవచాలుగా తొడిగారన్నారు. ప్రజాపక్షం వహిస్తూ కలం పోరు సాగించడాన్ని అలవరిచారని కొనియాడారు.

“తన మానస పుత్రిక ‘ఈనాడు’ స్వర్ణోత్సవ సంబరాలను రామోజీరావు కనులారా చూసుకొని ఉంటే ఎంతో సంబరపడేవారు. ఆయన కొద్ది నెలల క్రితమే మహాభినిష్క్ర్కమణం గావించినా ఆయన అందించిన విలువలు, క్రమశిక్షణతో… ఈనాడు పత్రికను మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్, సంపాదకులు, పాత్రికేయులు, సిబ్బంది దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్తారనే విశ్వాసం ఉంది’’ అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

(ఈనాడు నుండి)

Join WhatsApp Channel
Join WhatsApp Channel