Vijay Rashmika Scholarships: అచ్చంపేట మండల విద్యార్థులకు విజయ్ దేవరకొండ, రష్మిక స్కాలర్‌షిప్‌లు

సినీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న విద్యార్థులను ప్రోత్సహించే దిశగా కీలక అడుగు వేశారు. అచ్చంపేట మండలంలోని 180 మంది ప్రతిభావంతులైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వారు స్కాలర్‌షిప్‌లను అందజేశారు. విజయ్ దేవరకొండ తండ్రి జన్మస్థలమైన తుమ్మన్‌పేట గ్రామంలో ఆదివారం ఈ స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో జరిగిన తమ వివాహం తర్వాత తాము కన్న ఒక చిన్న కలలో భాగంగా, కష్టపడి చదివే విద్యార్థులను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నట్లు విజయ్ తన ‘X’ (ట్విట్టర్) ఖాతాలో పేర్కొన్నారు. తెలంగాణలోని అచ్చంపేట మండల పరిధిలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతుల్లో మొదటి, రెండవ ర్యాంకులు సాధించిన 180 మంది విద్యార్థులను ఈ మెరిట్ స్కాలర్‌షిప్‌ల కోసం ఎంపిక చేశారు. తల్లిదండ్రులను గర్వపడేలా చేసిన ఈ 180 మంది జాబితాను ఆయన పంచుకున్నారు.

Join WhatsApp Channel