N Convention: ఎన్​ కన్వెన్షన్‌ కూల్చివేత.. హైడ్రా చెప్పిందిదే

Photo of author

Eevela_Team

Share this Article

సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్​ కన్వెన్షన్‌ను హైడ్రా బృందం కూల్చి వేసింది. అయితే ఈ అంశంపై తీవ్ర వివాదం జరుగుతుండగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ కూల్చివేతపై వివరణ ఇచ్చారు. ఎన్​ కన్వెన్షన్‌ ఎఫ్​టీఎల్, బఫర్​ జోన్ కలిపి 3.30 ఎకరాలు ఆక్రమించినట్లు తెలిపారు. ఎన్​ కన్వెన్షన్‌తో పాటూ తుమ్మడికుంట చెరువు పరిధిలోని ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలోని ఆక్రమణలు హైడ్రా, జీహెచ్‌ఎంసీ, టౌన్‌ప్లానింగ్‌, రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారన్నారు. తుమ్మిడికుంటలోని అనధికార నిర్మాణాల్లో ఎన్‌ కన్వెన్షన్‌ ఒకటని ఆయన చెప్పారు.

చెరువులోని ఎఫ్‌టీఎల్‌లో ఎకరా 12 గుంటలు, బఫర్‌ జోన్‌ పరిధిలోని 2 ఎకరాల 18 గుంటల్లో మొత్తంగా 3.30 ఎకరాల ఆస్తిలో అక్రమంగా ఎన్‌ కన్వెన్షన్‌ నిర్మించినట్లు పేర్కొన్నారు. ఈ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ నుంచి ఎటువంటి అనుమతులు లేవని చెప్పుకొచ్చారు. బిల్డింగ్ రెగ్యులరేషన్ స్కీమ్ కింద అనుమతుల కోసం ఎన్‌ కన్వెన్షన్‌ ప్రయత్నించిందని, సంబంధిత అధికారులు బీఆర్‌ఎస్‌కు అనుమతించలేదని రంగనాథ్‌ ప్రకటనలో వివరించారు.

Join WhatsApp Channel
Join WhatsApp Channel