టీ20 మహిళల ప్రపంచకప్‌ను భారత జట్టు గెలుస్తుందని ఆ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ విశ్వాసం వ్యక్తం చేసింది.
మహిళల టీ20 ప్రపంచకప్ సిరీస్ అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 20 వరకు జరగనుంది. ఈ టోర్నీ నిజానికి బంగ్లాదేశ్‌లో జరుగవలసి ఉంది. అయితే అక్కడ ప్రస్తుతం ఉన్న రాజకీయ అనిశ్చితి కారణంగా టోర్నమెంట్ వేదిక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు మార్చబడింది.
యూఏఈలో భారత జట్టు ఇంతవరకు పెద్ద టోర్నీ ఆడలేదు. కానీ యూఏఈ పిచ్‌ల స్వభావం భారత పిచ్‌ల మాదిరిగానే ఉండబోతోందని నేను భావిస్తున్నాను. త్వరలో యూఏఈ పిచ్‌ల స్వభావానికి తగ్గట్టుగా మలుచుకుంటాం’’ అని ఆమె చెప్పింది.