Jay shah: ఐసీసీ అధ్యక్షుడిగా జై షా ఏకగ్రీవ ఎన్నిక!

Photo of author

Eevela_Team

Share this Article

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా భారత క్రికెట్ బోర్డు కార్యదర్శి జై షా ఎంపికయ్యారు. ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ఐసీసీ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ప్రస్తుతం ఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న న్యూజిలాండ్‌కు చెందిన IIC ప్రెసిడెంట్ గ్రెగ్ బార్క్లే మూడవసారి అవకాశం ఉన్నా మరోసారి బాధ్యత చేపట్టడానికి ఆసక్తి చూపలేదు.

అతి చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా జే షా (35) ఎంపిక కావడం గమనార్హం. అక్టోబర్ 2019 నుంచి బీసీసీఐ గౌరవ కార్యదర్శిగా, జనవరి 2021 నుంచి ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా సేవలందించిన జై షా డిసెంబర్ 1న ఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్న ఆయన భారత్‌ నుంచి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి ఛైర్మన్‌గా ఎన్నికైన ఐదో వ్యక్తి.

Join WhatsApp Channel
Join WhatsApp Channel