భారత్-శ్రీలంక మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మూడోది మరియు చివరిదైన T20 మ్యాచ్ లో సూపర్ ఓవర్ జరుగగా భారత్ విజయం సాధించింది. భారత్ చేసిన 137 పరుగులను 20 ఓవర్లలో సమయం చేసిన శ్రీలంక సూపర్ ఓవర్ ఆడవలసి వచ్చింది. కుశల్ మెండిస్ (43) , కుశల్ పేరేరా (41) పరుగులు చేసినా చివర్లో వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చెరలేకపోయింది.
సూపర్ ఓవర్లో కూడా తరబడ్డ లంక బ్యాట్స్మెన్ రెండు వికెట్లూ కోల్పోయి కేవలం 3 పరుగులే చేశారు. ఆ తర్వాత తొలి బంతికే సూర్య కుమార్ యాదవ్ ఫోర్ కొట్టి విజయాన్ని అందించాడు.
అంతకు ముందు పల్లెకెలె స్టేడియంలో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యంగా మొదలవ్వగా శ్రీలంక టాస్ గెలిసి భారత్ ను ముందుగా బ్యాటింగ్ కు పంపింది. పిచ్ సహకరించక భారత్ త్వర త్వరగా వికెట్లు కోల్పోయింది. గాయం తర్వాత మ్యాచ్ ఆడుతున్న గిల్ (39) పరుగులు చేయగా సూర్యకుమార్ యాదవ్ 8 పరుగులకే అవుటయ్యాడు. ఒకానొక దశలో 48 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో మిడిల్ ఆర్డర్ కుదురుగా ఆడింది. వాషింగ్టన్ సుందర్ (25), రియాన్ పరాగ్ (26) పరుగులతో జట్టుకి గౌరవ ప్రదమైన స్కోర్ (137) ని అందించారు.