ఆసియాకప్ క్రికెట్ టోర్నమంట్ లో ఈరోజు మరోసారి భారత్-పాక్ తలపడుతున్నాయి. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ విశేషాలు.
భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ పరిస్థితికి ఫీల్డింగ్ చెంచుకోవడం సరైన నిర్ణయం అని విశ్లేషకులు తెలిపారు.
పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఖా మరియు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మధ్య హ్యాండ్‌షేక్ ఈరోజు కూడా లేదు. తొలి మ్యాచ్ లో కూడా భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో హ్యాండ్‌షేక్ చేయలేదు.
గత సంవత్సరం న్యూయార్క్‌లో జరిగిన T20 ప్రపంచ కప్ మ్యాచ్ మినహా, భారత్ & పాకిస్తాన్ మధ్య జరిగిన చివరి తొమ్మిది T20I లలో ఎనిమిదింటిలో ఛేజింగ్ జట్టు విజయం సాధించింది.
ప్లేయింగ్ XI:
భారత్ జట్టు – అభిషేక్ శర్మ, శుభ్‌మాన్ గిల్, సంజు సామ్సన్ (w), సూర్యకుమార్ యాదవ్ (c), తిలక్ వర్మ, శివం దుబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
పాకిస్థాన్ జట్టు – సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా (సి), హుస్సేన్ తలత్, మహ్మద్ హారిస్ (w), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.