20.7 C
Hyderabad
Monday, February 16, 2026
HomeSportsIND vs PAK T20 WC Live: మ్యాచ్ ఈరోజే ... వర్షం ముప్పు

IND vs PAK T20 WC Live: మ్యాచ్ ఈరోజే … వర్షం ముప్పు

టి20 ప్రపంచకప్ 2026లో భాగంగా దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్‌లు ఆదివారం (ఫిబ్రవరి 15) తలపడనున్నాయి. కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియం ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.

గ్రూప్-ఏలో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ (అమెరికా, నమీబియాపై) విజయం సాధించి టీమిండియా జోరుమీదుంది. అటు పాకిస్థాన్ కూడా నెదర్లాండ్స్, అమెరికాలపై గెలిచి సమాన పాయింట్లతో ఉంది. నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు సూపర్-8 బెర్తును దాదాపు ఖాయం చేసుకుంటుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని యువ భారత్ జట్టు, సల్మాన్ అలీ ఆఘా నేతృత్వంలోని పాక్ జట్టును ఢీకొట్టేందుకు సిద్ధంగా ఉంది.

కొలంబోలో ఈరోజు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సాయంత్రం వేళ ఉరుములతో కూడిన జల్లులు పడే ప్రమాదం ఉండటంతో మ్యాచ్‌కు అంతరాయం కలగవచ్చు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది.

జట్ల వివరాలు (అంచనా):భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్/వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.పాకిస్థాన్: సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), బాబర్ ఆజం, రిజ్వాన్, సైమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రౌఫ్ తదితరులు.

ఓ లుక్కేయండి

తాజా వార్తలు

Join WhatsApp Channel