శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)కి కొత్త డైరెక్టర్‌గా డా. ఈ. ఎస్. పద్మకుమార్ గురువారం నియమితులయ్యారు. ప్రస్తుతం డైరెక్టర్‌గా ఉన్న ఆర్ముగం రాజరాజన్‌ను విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, తిరువనంతపురానికి బదిలీ చేశారు. ఇస్రో ఉపగ్రహ కేంద్రంలో కీలక పదవుల్లో పనిచేసిన పద్మకుమార్‌కు అంతరిక్ష పరిశోధనలో విశేష అనుభవం ఉంది.
ఈ.ఎస్. పద్మకుమార్ గురించి…
- ఈ.ఎస్.పద్మకుమార్ బెంగళూరులోని ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్స్ యూనిట్‌లో డైరెక్టర్‌గా పనిచేస్తూ, ఇప్పుడు షార్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. ఆయన బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc)లో సిస్టమ్ సైన్స్ అండ్ ఆటోమేషన్‌లో మాస్టర్ డిగ్రీ పూర్తిచేసి, 1996లో ఇస్రోలో ఇంజినీర్‌గా చేరారు.
- పద్మకుమార్ పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ, ఎల్‌ఆర్‌ఎల్‌వి, ఎస్.ఎస్.ఎల్.వి లాంటి ప్రయోగ వాహనాలతో పాటు, ప్రతిష్టాత్మకమైన మార్స్ ఆర్బిటర్ మిషన్, చంద్రయాన్, ఆదిత్య లాంటి ప్రయోగాల్లో కీలక పాత్ర పోషించారు.